Station Ghanpur Councilor | మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డ కౌన్సిలర్

ఓ కౌన్సిలర్​ అర్ధరాత్రి మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్​ ఘనపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Station Ghanpur Councilor | ప్రజాప్రతినిధిగా ప్రజలు సమస్యలు పరిష్కరించాల్సిన ఓ వ్యక్తి.. అర్ధరాత్రి ఓ మహిళ ఇంట్లోకి నగ్నంగా వెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన జనగామ జిల్లా (Jangaon District) స్టేషన్​ ఘనపూర్​ మండలం చాగల్లులో చోటు చేసుకుంది.

చాగల్లు గ్రామం మున్సిపాలిటీలో విలీనం అయింది. వార్డ్​ కౌన్సిలర్​ సంపత్ రాజ్ సోమవారం అర్ధరాత్రి ఒంటిపై నులు పోగు లేకుండా స్థానికంగా ఉండే ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Station Ghanpur Councilor | బాత్​రూమ్​లో బంధించి..

Station Ghanpur Councilor

నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం చేయడానికి సంపత్​రాజ్​ యత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు. అందరిని చూసి భయపడిన నిందితుడు బాత్​రూమ్​లోకి వెళ్లాడు. వెంటనే స్థానికులు బయట నుంచి గడియ పెట్టారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కౌన్సిలర్​ సంపత్​రాజ్​ను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *