Medical Workers Salaries | జీజీహెచ్​, మెడికల్​ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ధర్నా

జీజీహెచ్​, మెడికల్​ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Medical Workers Salaries | జీజీహెచ్​, మెడికల్​ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య పేర్కొన్నారు. నగరంలోని మెడికల్​ కళాశాల ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం ఏడీ రమాదేవికి వినతిపత్రం అందజేశారు.

Medical Workers Salaries | కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ విధానాన్ని రద్దు చేయాలి

ఓమయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందికి సంబంధించిన వేతన సవరణ ఒప్పందం కాల పరిమితి ముగిసి సంవత్సరం అవుతోందన్నారు. ఇప్పటికీ వేతనాలు పెరగకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ విధానాన్ని రద్దుచేసి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. వెంటనే కార్పొరేషన్​ను ఏర్పాటు చేయడంతో పాటు పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

Medical Workers Salaries

ప్రస్తుతం కార్మికులపై పనిభారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, అర్జీత సెలవులు ఇవ్వాలని ఈనెల 9న కోటిలోని డీఎంఈ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నామన్నారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె నిర్వహించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్, యూనియన్ కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు కవిత, స్వరూప, భారతి, కవిత, వెంకటేష్, మరియు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Enumeration Process Kamareddy | ఎస్​ఐఆర్​ ప్రక్రియ సజావుగా సాగడం లేదు : బీఆర్ఎస్ ఆరోపణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *