అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy | ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన ఫీఫా వరల్డ్ కప్-2026 మ్యాచ్‌ను సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై అర్జెంటినా–ఈజిప్ట్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తిలకిస్తూ విద్యార్థులతో ఆనందాన్ని పంచుకున్నారు.
Revanth Reddy | అర్జెంటినా 3–2 గోల్స్ తేడాతో విజయం
మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యార్థుల కేరింతలు, హర్షధ్వానాలతో శిల్పకళా వేదిక సందడిగా మారింది. ప్రతి గోల్‌కు విద్యార్థులు ఉత్సాహంగా స్పందించగా, ముఖ్యమంత్రి కూడా వారితో కలిసి మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటినా 3–2 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌పై విజయం సాధించింది.
Revanth Reddy | మెస్సీ హైదరాబాద్ పర్యటనతో
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల హైదరాబాద్ పర్యటనతో రాష్ట్రంలో ఫుట్‌బాల్‌కు కొత్త ఊపు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రత్యేక వీక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
గత డిసెంబర్లో మెస్సీ హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఆయన మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయడం, ముఖ్యంగా విద్యార్థులు, యువ క్రీడాకారుల్లో ఫుట్‌బాల్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
Revanth Reddy | క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం
ఆ స్పూర్తిని కొనసాగించేలా ప్రభుత్వం ఈ మ్యాచ్ వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి మ్యాచ్‌ను తిలకించడం ద్వారా క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయి క్రీడలను దగ్గరగా అనుభవించే అవకాశాన్ని కల్పించినట్లైంది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అర్జెంటినా జట్టుకు మద్దతు తెలుపుతూ కేరింతలు కొట్టారు. మ్యాచ్ ముగిసిన అనంతరం విజేత జట్టుకు అభినందనలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తిని చాటారు.