అక్షరటుడే, వెబ్డెస్క్: Swathi Second Marriage | ప్రముఖ నటి స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ‘మంత్ ఆఫ్ మధు’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Swathi Second Marriage | గతంలో వాసుతో ప్రేమ వివాహం
స్వాతి గతంలో మలయాళీ పైలట్ వికాస్ వాసుతో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ విడిపోయారనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నప్పటికీ, ఆ విషయంపై స్వాతి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.
ఇటీవల సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చిన స్వాతి, ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. అదే సినిమా దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన స్వాతి, శ్రీకాంత్ నాగోతి దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.