Arvind SIR Campaign | ‘సర్​’లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి.. రోహింగ్యాలను తరమికొట్టాలి..: ఎంపీ అర్వింద్​

ప్రతి భారతీయుడు ‘సర్’ కార్యక్రమంలో పాల్గొని, రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తరిమికొట్టాలని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Arvind SIR Campaign | ప్రతి భారతీయుడు ‘సర్’ కార్యక్రమంలో పాల్గొనాలని తద్వారా రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తరిమికొట్టాలని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) అన్నారు. జానకంపేటలో గూడ్స్ షెడ్​ను ప్రారంభించిన అనంతరం ఎంపీ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Arvind SIR Campaign | మాధవ్ నగర్ బ్రిడ్జిపై నిర్లక్ష్యం

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ మాట్లాడుతూ మాధవ నగర్ బ్రిడ్జి నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. వంతెన వద్ద సెల్ఫీ వీడియో తీసినా కాంగ్రెస్ నేతలకు సిగ్గు రావడంలేదని ద్వజమెత్తారు. రెండు గూడ్స్ షెడ్స్​ తన హయాంలోనే రావడం ఆనందంగా ఉందని ఎంపీ అన్నారు.

Arvind SIR Campaign | రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు..

Arvind SIR Campaign

రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రానికి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లుతుందన్నారు. ధాన్యాన్ని కొంటున్నది తామేనని కాంగ్రెస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని ఆ ధాన్యాన్ని కేంద్ర పరిధిలోని ఎఫ్సీఐ కి ఇస్తున్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. సర్ ప్లస్ బడ్జెట్ ఉన్నప్పటికీ అప్పులు తో రాష్ట్రాన్ని మాకు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారని ఇది ఎంతవరకు నిజమో వారే చెప్పాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీపరంగా ప్రజలకు ఏం చేయవచ్చో న్యాయబద్ధంగా పూర్తిచేసి బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయాశక్తుల కృషి చేస్తామని ఎంపీ అన్నారు. దీనికోసం ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Handloom Society Elections | చేనేత సహకార సంఘం పాలక మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *