Temple Development | దేవాలయాల పరిరక్షణకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Temple Development | కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి (MLA Dr. Bhupathi Reddy) అన్నారు. మాధవ్‌నగర్ సాయిబాబా ఆలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు.

Temple Development | ఆలయంలో ప్రత్యేక పూజలు

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఆలయ పాలకవర్గ నూతన ఛైర్మన్ పొలసాని మీనా- శ్రీనివాస్​తో పాటు కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే సమాజంలో శాంతి, సామరస్యం నెలకొంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాలకు కొత్త శోభ వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సహా అనేక ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

Temple Development | మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం..

Temple Development

మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా తప్పుబట్టారు. ‘జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తేనే హిందువులు అయిపోరని, శ్రీరాముడి ఆదర్శాలను ఆచరించడమే నిజమైన భక్తి’ అని వ్యాఖ్యానించారు. అయోధ్య రామమందిరానికి సంబంధించిన నిధుల వినియోగంలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దేవాలయాల ఆదాయం, ఆస్తులు భక్తుల విశ్వాసానికి ప్రతీకలని, వాటి నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సాయిబాబా ఆలయ నూతన పాలకవర్గం భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Temple Development | మాధవ నగర్​ ఆలయ అభివృద్ధికి కృషి..

ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయ అభివృద్ధికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. అలాగే గుండారం–మల్కాపూర్‌లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి కూడా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ ఛైర్మన్ పొలసాని మీనా-శ్రీనివాస్, డైరెక్టర్లు, మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తరుణ్, శ్రీనివాస్, వినోద్, రాంచందర్ గౌడ్, పార్టీ మండలాల అధ్యక్షుడు జనార్ధన్, గోవర్ధన్ రెడ్డి, సంజయ్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Diagnostic Center Scam | స్కానింగ్​ సెంటర్ల దోపిడీ.. వైద్యుల సిండికేట్​తో రోగుల జేబులకు చిల్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *