అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gram Panchayat Development | గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని మంత్రి సీతక్క (Minister Seethakka) సూచించారు. ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని సూచించారు.
పంచాయతీలను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో గురువారం ములుగు (Mulugu)లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క మాట్లాడారు. సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పాలన, చట్టాలు, విధివిధానాలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ స్థిరమైన యాక్షన్ ప్లాన్ అమలు, ఆర్థిక నిర్వహణ, పారదర్శక పాలనపై సమగ్ర అవగాహన కల్పించేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Gram Panchayat Development | 16వ ఆర్థిక సంఘం నిధులు
16వ ఆర్థిక సంఘం నిధులు అమల్లోకి వస్తున్న తరుణం లో ప్రతి సర్పంచ్ నిధుల మార్గదర్శకాలు, వినియోగ విధానం, అనుమతించబడిన పనులు, వ్యయ నియమాలను పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు. గతంలో అవగాహన లోపంతో కొందరు సర్పంచులు నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. టైడ్ ఫండ్స్, అన్‌టైడ్ ఫండ్స్, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులకు వంటి ప్రతి నిధికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, ఆయా నిబంధనలకు అనుగుణంగానే ఖర్చు చేయాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Telangana Sports Policy | క్రీడల్ని ప్రోత్సహించేందుకు పాలసీ : సీఎం రేవంత్‌రెడ్డి