అక్షరటుడే, కామారెడ్డి: TRP Party Flag | భువనగిరిలో మే 5న జరిగిన టీఆర్పీ సభ విజయాన్ని చూసి ఓర్వలేకనే రాత్రి పార్టీ జెండా గద్దెను కూల్చివేశారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హన్మాండ్లు ఆరోపించారు. గురువారం రాత్రి కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న పార్టీ గద్దె కూల్చివేసిన సమాచారం మేరకు ఆయన పార్టీ గద్దెను పరిశీలించారు.
TRP Party Flag | పోలీసులకు ఫిర్యాదు..
నాయకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హన్మాండ్లు మాట్లాడుతూ.. కామారెడ్డిలో పార్టీ జెండా కూల్చేయడం క్రూరమైన చర్య అన్నారు. పక్కన ఇతర పార్టీల జెండాలు ఉన్నప్పటికీ కేవలం టీఆర్పీ గద్దెను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారని తెలిపారు. తీన్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్నందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గద్దె కూల్చివేత ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కమిషనర్‌కు ఫోన్ చేస్తే రెండు రోజులుగా సెలవులో ఉన్నానని, ఇన్‌ఛార్జి కమిషనర్‌ను అడిగితే తెలియదని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TRP Party Flag | కమిషనర్లకు తెలియకుండానే కూల్చేస్తారా..?
కమిషనర్లకు తెలియకుండా కూల్చివేస్తారా..? ప్రభుత్వ ఉద్యోగులు కాదా అని ప్రశ్నించారు. ప్రతి అధికారి తప్పులను రికార్డ్ చేస్తున్నామని, టీఆర్పీ అధికారంలోకి వచ్చాక అధికారుల సంగతి చూస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు సరిగా పని చేయకుండా నాయకులకు లొంగిపోతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ తాహెర్, ఉపాధ్యక్షుడు కళ్లెం రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నిర్లక్ష్యం.. బాన్సువాడ ఎంపీవోపై వేటు