Nizamabad Chain Snatching | నగరంలో చైన్​ స్నాచింగ్​.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

నిజామాబాద్ నగరంలో చైన్​ స్నాచింగ్​ కలకలం రేపింది. దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad Chain Snatching | నిజామాబాద్ (Nizamabad) నగరంలో చైన్​ స్నాచింగ్​ కలకలం రేపింది. మూడో టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని , కమ్మలు అపహరించారు.

నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ , ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే పరిశీలించాలని , నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని, నేరస్తుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించాలని కమిషనర్ సూచించారు.

Nizamabad Chain Snatching | అప్రమత్తంగా ఉండాలి

Nizamabad Chain Snatching

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. అదనపు డీసీపీ (అడ్మిన్ ) శుభం ప్రకాష్, నిజామాబాద్​ ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్ 3 ఎస్సై హరిబాబు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Hostels | హాస్టళ్లలో విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *