Tata Sumo Robbery | టాటా సుమోలో వచ్చి దోపిడీ దొంగల హల్​చల్​.. భయాందోళనలో ప్రజలు..

నిజామాబాద్​లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్​లు, మెడికల్ షాప్ దోపిడీకి పాల్పడడం సంచలనంగా మారింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం​: Tata Sumo Robbery | నిజామాబాద్​ (Nizamabad)లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్​లు, మెడికల్ షాప్ దోపిడీకి పాల్పడడం సంచలనంగా మారింది.

Tata Sumo Robbery | నిర్మల్​ జిల్లా నుంచి ఆర్మూర్​లోకి..

జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా హల్​చల్​ చేసింది. టాటా సుమోలో వచ్చిన నలుగురుతో కూడిన ముఠా బీభత్సం సృష్టించింది. నిర్మల్​లో అపార్ట్​మెంట్​లో చోరీకి పాల్పడిన అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలోకి ప్రవేశించిన ముఠా ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ షాపు షెట్టర్​ను ధ్వంసం చేసింది. షాప్​లోని 1.5 లక్షల నగదును దోచుకుంది.

Tata Sumo Robbery | నగరంలో చైన్స్ స్నాచింగ్​లు..

ఆర్మూర్​లో మెడికల్ షాపు దోపిడీకి పాల్పడిన అనంతరం నలుగురితో కూడిన ముఠా టాటా సుమోలో నగరంలోకి ప్రవేశించింది. తెల్లవారుజామున విజయ్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉదయం దుండగులు మహిళపై దాడిచేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వారు దుబ్బ ప్రాంతంలోని సబ్​స్టేషన్​ వద్ద ఓ ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న మహిళపై దాడి చేశారు. ఆమెను తీవ్రంగా కొట్టి బంగారు గొలుసు లాక్కున్నారు. ఒక చెవికమ్మ తీసుకోని..మరో చెవికమ్మ తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో వారు పరారయ్యారు.

Tata Sumo Robbery | వరుస చోరీలతో భయాందోళన..

నగరంలో వరుస చోరీలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. శనివారం రెండు చోట్ల ఏకంగా టాటా సుమోలో వచ్చి చైన్​ స్నాచింగ్​కు పాల్పడిన దుండగులు అనంతరం జిల్లాను వదిలి పారిపోయినట్లు సమాచారం. నెలల వ్యవధిలోనే గొలుసు దొంగతనాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. పలుకేసుల్లో నిందితులు పట్టుబడ్డప్పటికీ చోరీలు మాత్రం ఆగట్లేదు. బంగారం రేటు పెరగడం కూడా ఈ చోరీలు జరగడానికి కారణమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Tata Sumo Robbery | పలు సంఘటనలివే..

నగరంలో నాలుగో టౌన్ పరిధిలో ఓ అగంతకుడు అర్ధరాత్రి వేళ మా ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలి మెడల నుంచి గొలుసును తస్కరించాడు. అలాగే బోధన్ ప్రధాన కూడలిలో రద్దీగా ఉన్న రోడ్డుపైనే మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన ఘటన గతంలో సంచలనం రేపింది. నగరంలోని గాయత్రి నగర్​లో సైతం మహిళ మెడల నుంచి చైన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించి దొంగలు విఫలమయ్యారు. మూడో టౌన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న మహిళల నుంచి సైతం గొలుసు లాక్కెళ్లేందుకు ముఠా ప్రయత్నించగా ఆమె అలెర్ట్ అయి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో దొంగల ప్రయత్నం ఫలించలేదు. ఇలా చైన్ స్నాచింగ్ ముఠాలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. ఉదయం పూట బయటకు వచ్చి పనులు చేసుకునేందుకు మహిళలు భయపడే పరిస్థితి తయారైంది.

Tata Sumo Robbery | సంఘటనా స్థలానికి సీపీ సాయి చైతన్య..

Tata Sumo Robbery

దుబ్బ ప్రాంతంలో చైన్ స్నాచింగ్​ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. సమాచారం తెలుసుకున్న సీపీ సాయి చైతన్య సంఘటన స్థానానికి వెళ్లారు. బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. పూర్తి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్​ బృందం, బ్లూకోల్ట్​ సిబ్బంది పనితీరుపై ఆరా తీసినట్లు సమాచారం.

Tata Sumo Robbery | సవాలుగా స్వీకరించి.. మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి..

చైన్​స్నాచింగ్​ ముఠా కేసును పోలీసులు సవాల్​గా తీసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు సీపీ మూడు ప్రత్యేక పొందాలని ఏర్పాటు చేసినట్లు సమాచారం. డీఎస్పీ శ్రీశైలం ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఇప్పటికే ముఠా అడ్రస్ కనిపెట్టేందుకు రంగంలోకి దిగాయి. త్వరలోనే ఈ ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Chain Snatching | నగరంలో చైన్​ స్నాచింగ్​.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *