Shabad Murders Case | షాబాద్​ హత్యల కేసు.. ఎస్సై, సీఐల సస్పెన్షన్​

షాబాద్​ హత్యల కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. పోక్సో కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై, సీఐలను సస్పెండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shabad Murders Case | రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాబాద్​ మండలం దైవాలగూడలో పోక్సో కేసు (POCSO Case) నిందితుడు ఆరుగురిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు.

నిందితుడు రాజ్‌కుమార్‌ను పట్టిస్తే రూ.2లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు తెలిపారు. ఆరుగురిని హత్య చేసి రాజ్‌కుమార్‌ పారిపోయాడు. ఇప్పటికే పోలీసులు నిందితుడి కోసం 10 బృందాలతో గాలిస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఆచూకీ లభించకపోవడంతో తాజాగా రివార్డు ఇస్తామని ప్రకటించారు.

Shabad Murders Case | నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో..

రాజ్​కుమార్​ తనపై పోక్సో పెట్టిన బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మను హత్య చేశాడు. అంతేగాకుండా తన భార్య, పిల్లలను సైతం మర్డర్​ చేశాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఆరు హత్యలు జరిగాయని స్థానికులు షాబాద్​ పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోక్సో కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్​ ఉదయం ప్రకటించారు. సీఐ క్రాంతిరెడ్డిని సైతం సస్పెండ్​ చేస్తూ తాజాగా సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు రాజ్​కుమార్​కు పోలీసులు సహకరించడంతోనే ఈ హత్యలు జరిగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు.

దీనిని కూడా చదవండి : Rainwater Harvesting | ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *