BLO Attack Case | బీఎల్‌వోపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు

ఎస్ఐఆర్​ ప్రక్రియలో భాగంగా విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ​

shashi kiran Mottala

అక్షరటుడే, ​కామారెడ్డి : BLO Attack Case | ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వో (Booth Level Officer) పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ​రాష్ట్రవ్యాప్తంగా ఎస్​ఐఆర్​ కార్యక్రమం జోరుగా సాగుతోంది.

BLO Attack Case | సైలానిబాబా కాలనీలో..

ప్రభుత్వం నియమించిన బీఎల్‌వోలు ఓటర్ల వద్దకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని సైలాని బాబా కాలనీ సమీపంలో బీఎల్‌వో అనిత ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ​అయితే, కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు తమకు ఫొటో లేని ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలంటూ ఆమెతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఫారాలనే తాము పంపిణీ చేస్తామని, ఫొటోలు లేనివి ఇవ్వడం కుదరదని ఆమె స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తులు బీఎల్‌ఓ చేతిలోని ఫారాలను లాక్కోవడానికి ప్రయత్నించి, ఆమెపై దాడికి పాల్పడ్డారు. ​ఈ ఘటనపై బీఎల్‌వోలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పరిధిలో లేని పని చేయాలంటూ దాడికి తెగబడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై బాధితురాలు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు.

ఇది కూడా చదవండి: Sumanth’s #NewtonsThirdLaw – August 7th Release….

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *