అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Prostitution Raid | నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారంతో నగర సీఐ శ్రీనివాస్ రాజ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ కార్యాలయానికి సమీపంలోని ఓ ఇంటిపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు పురుషులను, వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను అరెస్టు చేశారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు మహిళలను రక్షించి సదర్ హోంకు తరలించారు.
Nizamabad Prostitution Raid | అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరెస్టు చేసిన నలుగురు వ్యక్తులతో పాటు వ్యభిచార గృహ నిర్వాహకురాలిని రిమాండ్‌కు తరలించినట్లు నగర సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు.
నగరంలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, ప్రజల నుంచి సమాచారం అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.