Banswada DSP Office | బాన్సువాడలో త్వరలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ప్రజలకు వేగవంతంగా, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada DSP Office | ప్రజలకు వేగవంతంగా, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ(Banswada) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. ఆదివారం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో(Banswada Government Area Hospital) పోలీస్ హెల్త్ ఔట్‌పోస్ట్​ను ప్రారంభించారు. త్వరలోనే డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.

Banswada DSP Office | సదరం క్యాంప్​, సీఐ కార్యాలయం ప్రారంభం

దివ్యాంగుల సర్టిఫికెట్లు, పెన్షన్ల కోసం శాశ్వత సదరం క్యాంప్​ను, అలాగే నూతనంగా నిర్మించిన బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, ఎస్పీ రాజేష్ చంద్ర, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కార్యాలయాల ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందన్నారు. బాన్సువాడ ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

Banswada DSP Office | త్వరలోనే బాన్సువాడలో..

నియోజకవర్గంలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టామని, సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, దీంతో రైతులకు సాగునీటి సమస్యలు తీరనున్నాయని పోచారం తెలిపారు. శాంతియుత వాతావరణం ఉన్న చోటే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ, త్వరలో బాన్సువాడలో డీఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. డయల్-100 సేవల ద్వారా ఇప్పటివరకు అనేక మంది ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. బాన్సువాడలో పోలీస్ శాఖకు ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త భవనాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

pocargam

ఇది కూడా చదవండి: మా ఇంటి బంగారం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో #Samantha ను సర్ప్రైజ్ చేస్తూ.. పోస్టర్ రిలీజ్ చేయగా ఆమె ఉబ్బితబ్బి అయ్యారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *