Charminar ACP Wife | చార్మినార్​ ఏసీపీ భార్య ఆత్మహత్య

చార్మినార్​ ఏసీపీ చంద్రశేఖర్​ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్​ జిల్లా అల్వాల్​లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Charminar ACP Wife | మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా (Malkajgiri District) అల్వాల్​ విషాదం చోటు చేసుకుంది. చార్మినార్​ ఏసీపీ చంద్రశేఖర్​ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు.

చార్మినార్​ ఏసీపీగా పని చేస్తున్న చంద్రశేఖర్ తన భార్య హేమలత (50)తో కలిసి అల్వాల్‌లోని సాయిబాబానగర్‌ కాలనీలో ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయి. కుమారుడు చంద్రహాస్​ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో హేమలత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చంద్రశేఖర్​ ఫోన్​ చేసిన ఆమె లిఫ్ట్​ చేయకపోవడంతో.. వెంటనే కుమారుడికి ఫోన్​ చేశాడు.

Charminar ACP Wife | అనారోగ్య సమస్యలతో..

Charminar ACP Wife

చంద్రహాస్​ ఇంటికి వెళ్లి చూసే సరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. ఆమె ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన తల్లి కడుపు, వెన్నెముక సంబంధమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు చంద్రహాస్​ తెలిపారు. ఆ బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Rain Forecast | రైతులకు గుడ్​ న్యూస్.. 16 నుంచి రాష్ట్రానికి వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *