జాతీయంKejriwal Tweet | పంజాబీలను దెబ్బకొట్టిన బీజేపీ.. ఎంపీల జంప్‌పై కేజ్రీవాల్ ఘాటు ట్వీట్

Kejriwal Tweet | పంజాబీలను దెబ్బకొట్టిన బీజేపీ.. ఎంపీల జంప్‌పై కేజ్రీవాల్ ఘాటు ట్వీట్

అక్షరటుడే, న్యూఢిల్లీ: Kejriwal Tweet | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంపై ఆప్ అధిష్టానం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన చేరిక కాదని, కేంద్రం తన ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని చేసిన కుట్ర అని ఆరోపించింది.

Kejriwal Tweet | సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు..

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఈడీ (ED), సీబీఐ (CBI)లను ప్రయోగించి, ఎంపీలను భయపెట్టి బీజేపీ తమ వైపుకు లాక్కుందని ఆయన ఆరోపించారు. పార్టీ ఆ నేతల కోసం అన్నీ చేస్తే, ఇప్పుడు వారు స్వార్థం కోసం బీజేపీ ఒడిలో కూర్చున్నారని విమర్శించారు. ఎంపీలను లాక్కోవడమే కాకుండా, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సంజయ్ సింగ్ మండిపడ్డారు.

Kejriwal Tweet | కేజ్రీవాల్ ట్వీట్ వార్

మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “బీజేపీ మరోసారి పంజాబీలను దెబ్బకొట్టింది” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ ఎంపీల వలస కేవలం పార్టీకి సంబంధించినది మాత్రమే కాదని, ఇది పంజాబీ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

ఇది కూడా చదవండి..: Kejriwal Shock | కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఒకేసారి ముగ్గురు ఎంపీలు బీజేపీ గూటికి!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన...

Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి...