అక్షరటుడే, వెబ్‌డెస్క్: Albendazole Tablets | రాష్ట్రంలోని చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) సూచించారు. 96,81,855 మంది చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ ప్రారంభించామన్నారు.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు ఆల్బండజోల్ ట్యాబ్లెట్లను మంత్రి రాజనర్సింహ వేశారు. 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులందరికీ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులను కోరారు.
Albendazole Tablets | అనేక ఆరోగ్య సమస్యలు

పిల్లల్లో నులిపురుగులతో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మంత్రి పేర్కొన్నారు. ఇవి పిల్లల చదువుపై, ఏకాగ్రతపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. నులిపురుగులు బయటకు కనిపించకపోయినా వారి ఆరోగ్యానికి హానికరమే అని తెలిపారు. అందుకే ప్రతి చిన్నారికి ఆల్బండజోల్ మాత్ర వేయించడం అత్యంత అవసరం అని పేర్కొన్నారు. విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఆల్బండజోల్ మాత్ర వేయించుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న నిర్వహించే మాప్-అప్ కార్యక్రమంలో తప్పనిసరిగా మాత్ర అందజేస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: ABVP College Bandh | 14న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్‌నకు ABVP పిలుపు