ఆంధ్రప్రదేశ్​CM Chandrababu Naidu | బిజినెస్ రిఫార్మర్ చంద్రబాబు.. రేపు ముంబైలో ప్రతిష్టాత్మక పురస్కారం!

CM Chandrababu Naidu | బిజినెస్ రిఫార్మర్ చంద్రబాబు.. రేపు ముంబైలో ప్రతిష్టాత్మక పురస్కారం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ‘ఎకనమిక్ టైమ్స్’ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకోనున్నారు.

అక్షరటుడే, అమరావతి: CM Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆయన రేపు అందుకోనున్నారు.

CM Chandrababu Naidu | ముంబై వేదికగా అవార్డు ప్రదానం..

ముంబైలో రేపు సాయంత్రం అత్యంత వైభవంగా జరగనున్న కార్యక్రమంలో చంద్రబాబుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు పాల్గొనబోతున్నారు.

వినూతన్న విధానాల అమలుతో..

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమే కాకుండా, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (వ్యాపార వేగం), ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ (పాలనలో వేగం) అనే వినూత్న విధానాలను అమలు చేస్తున్నందుకు గాను ఎకనమిక్ టైమ్స్ చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

నవ్యాంధ్రను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాలకు ఈ అవార్డు ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Amaravati BITS | అమరావతిలో బిట్స్ పిలానీ ‘ఏఐ క్యాంపస్’.. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....