అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana TET Results | తెలంగాణ (Telangana) టెట్ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలను రిలీజ్ చేశారు.
రాష్ట్రంలో జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ విధానంలో టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,15,028 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 50,544 మంది టెట్ పరీక్షలో పాస్ అయ్యారు. 43.94 శాతం మంది అర్హత సాధించారు.
Telangana TET Results | ఏడాదికి నాలుగు పరీక్షలు
తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్నారు. అయితే ఇక నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా పరీక్ష పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21న వారి కోసం కొత్త టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇక పై సంవత్సరంలో మొత్తం నాలుగు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లకు 2.. సాధారణ అభ్యర్థులకు రెండు సార్లు టెట్ పరీక్షలు పెడతామన్నారు. అభ్యర్థులు https://schooledu.telangana.gov.inలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..: Shabad Killer Case | షాబాద్ కిల్లర్‌ను రేవంత్ సన్నిహితుడు కాపాడాడు.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు