అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajkumar Selfie Video | ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనకు ఒక రోజు ముందు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ తన మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో తన జీవితంలో ఎదురైన పరిణామాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత వేదన గురించి రాజ్‌కుమార్ మాట్లాడినట్లు సమాచారం.
Shabad Murder Case | షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య
Rajkumar Selfie Video | అన్ని విధాలా మోసపోయానంటూ..
వీడియోలో, “నేను ఒక అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయాను. ఆ కుటుంబం అన్ని విధాలా నన్ను వాడుకొని మోసం చేసింది. అప్పుల పాలయ్యాను. జీవితంపై విరక్తి కలిగింది. చివరకు నా పిల్లలకు కూడా భూమి లేకుండా పోయింది” అని రాజ్‌కుమార్ పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అదేవిధంగా, రాజ్‌కుమార్ రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తన మరణానికి నలుగురు వ్యక్తులు కారణమని పేర్కొంటూ వారి పేర్లను ప్రస్తావించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్లో ఉన్న వివరాల ఆధారంగా పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇందులో పేర్కొన్న ఆరోపణలు, ఇతర ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.