Keerthana Menon Marriage | పెళ్లి కోసం ఒత్తిడి.. గుండు గీయించుకున్న యువతి

ప్రముఖ సోషల్ మీడియా క్రియేటర్ కీర్తనా మీనన్ పెళ్లి విషయంలో తన కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడిని భరించలేక, వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Keerthana Menon Marriage | ప్రముఖ సోషల్ మీడియా క్రియేటర్ కీర్తనా మీనన్ పెళ్లి విషయంలో తన కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడిని భరించలేక, వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. పెళ్లి బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె ఏకంగా గుండు గీయించుకుని, ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మాకు నాకు పెళ్లి చేయాలని ఉంది’ అంటూ వ్యంగ్యంగా క్యాప్షన్ జత చేయడంతో, ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Keerthana Menon Marriage | సొంత నిర్ణయమే ప్రాధాన్యత..

జుట్టు అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్న కీర్తన, తన వ్యక్తిగత స్వేచ్ఛ , జీవిత నిర్ణయాలను తీసుకునే హక్కును కాపాడుకోవడం కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కుటుంబ సభ్యుల బలవంతపు పెళ్లిళ్ల ఒత్తిడితో సతమతమవుతున్న ఎంతో మంది యువతులకు తన చర్య ఒక సందేశమని ఆమె అభిప్రాయపడింది.

gundu 1

Keerthana Menon Marriage | నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్న మద్దతు..

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది. కీర్తనా మీనన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని నెటిజన్లు, ముఖ్యంగా యువతులు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. “అందమైన జుట్టు కంటే ఆత్మగౌరవమే మిన్న”, “వ్యక్తిగత స్వేచ్ఛ కోసం తీసుకున్న నిర్ణయం అదిరింది”, “ఇలాంటి సాహసోపేతమైన అడుగు ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్” అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బలవంతపు పెళ్లిళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఎంతో మంది మహిళలకు ఆమె నిర్ణయం ఒక కొత్త ఉత్సాహాన్ని , ధైర్యాన్ని ఇస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

 

 

ఇది కూడా చదవండి:  Lulu Mall Gun Incident | లులు మాల్‌లో గన్ కలకలం.. కేసు నమోదు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *