అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagan Chandrababu Allegations | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు (CM Chandrababu) సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోందని ఆరోపించారు.
భీమవరం ఆక్వా రైతుల సభలో జగన్ మాట్లాడారు. ముందుగా కాపు ఉద్యమ నేత ముద్రగడ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆక్వా రైతులకు సప్లయ్ చేసే సీడు, ఫీడు, పంట కొనుగోలు మొత్తం ప్రక్రియ చంద్రబాబు సిండికేట్ నడిపిస్తోందని జగన్ ఆరోపించారు. సీడు, ఫీడు రేట్లు నిర్ణయించేది వాళ్లే అన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన రొయ్యలు, చేపల ధరలను సిండికేట్ పడేస్తోందన్నారు. చంద్రబాబు సీఎం కుర్చీలోకి వస్తే సిండికేట్‌కు పండగే.. పండగ అన్నారు.
Jagan Chandrababu Allegations | చంద్రబాబు చర్మం కొంచెం మందం
సీఎం చంద్రబాబు చర్మం కొంచెం మందమని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దున్నపోతు వర్షం పడితే ఏమాత్రం కూడా చలించదో.. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైందని విమర్శించారు. ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీరు, సిండికేట్‌తో ఆక్వా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. నరసాపురంలో తమ హయాంలో తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారని, భీమవరం మెడికల్ కాలేజీ పనులు కూడా ఆపేశారన్నారు.
ఇది కూడా చదవండి..: Parawada Pharma Fire | పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్నిప్రమాదం