Nalgonda Murder Case | అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కడతేర్చిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడన్న కక్షతో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nalgonda Murder Case | అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడన్న కక్షతో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడిని నల్లగొండ జిల్లా ( Nalgonda ) పోలీసులు అరెస్ట్ చేశారు. వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Nalgonda Murder Case| ఆరేళ్లుగా అక్రమ సంబంధం..

నర్సాపురానికి చెందిన ఇస్లావత్ గోవిందు ఈ నెల 11న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, క్లూస్ టీమ్ , సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. విచారణలో గోవిందు భార్య సరోజకు, అదే గ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీనుతో గత ఆరేళ్లుగా అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయంపై భర్త గోవిందు సరోజను తరచూ నిలదీయడం, ఆమె ఫోన్‌ను ధ్వంసం చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. దీంతో గోవిందును అడ్డు తొలగించుకోవాలని సరోజ, శ్రీను కలిసి పథకం పన్నారు.

Nalgonda Murder Case | హత్య జరిగిన తీరు..

ఈ నెల 10, 11 తేదీల మధ్య అర్ధరాత్రి శ్రీను ఇంట్లోకి ప్రవేశించాడు. గోవిందు నిద్రిస్తుండగా శ్రీను అతని ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా నొక్కగా, సరోజ అతని కాళ్లను బలంగా పట్టుకుంది. గోవిందు ప్రతిఘటించడంతో శ్రీను పిడిగుద్దులతో దాడి చేయగా, సరోజ చెక్క రోకలి బండతో వృషణాలపై తీవ్రంగా కొట్టింది. దీంతో గోవిందు అక్కడికక్కడే మరణించాడు. నేరం తర్వాత నిందితులు హత్యకు వాడిన వస్తువులను, రక్తపు మరకలున్న దుస్తులను దాచిపెట్టి పరారయ్యారు.

Nalgonda Murder Case | నిందితుల అరెస్ట్..

సాంకేతిక ఆధారాల సాయంతో ఈ నెల 14న దామరచర్ల రైల్వే గేట్ సమీపంలో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రోకలి బండ, మొబైల్ ఫోన్లు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి , సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఇది కూడా చదవండి:  Hyderabad Diesel Buses | హైదరాబాద్​లో డీజిల్​ బస్సులు తొలగిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *