Nizamabad Education Review | విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

నాణ్యమైన విద్యను బోధించడం ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Education Review | ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, నాణ్యమైన విద్యను బోధించడం ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy)సూచించారు. కలెక్టరేట్​లో బుధవారం విద్యాశాఖ (School Education) పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

Nizamabad Education Review |జిల్లాలో ఉత్తీర్ణత మెరుగుపడింది

జిల్లాలో(Nizamabad) ఉత్తీర్ణత మెరుగుపడిందని, ఇదే స్పూర్తితో కృషి చేస్తూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా చొరవ చూపాలని ఉపాధ్యాయులకు సుదర్శన్​ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాల నిర్వహణ తీరుతెన్నులు, సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులు తదితర అంశాలపై సమీక్ష జరిపి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విద్యా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోట్లల్లో నిధులు వెచ్చిస్తున్నారని అన్నారు.

Nizamabad Education Review |ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా..

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా సాంకేతిక విద్యకు తోడ్పాటును అందిస్తోందని బోధన్​ ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను గుర్తెరిగి నాణ్యమైన విద్యను బోధిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఆయా సబ్జెక్టులలో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, నాణ్యమైన పౌష్టిక ఆహారం అందేలా చూడాలన్నారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తాము కృషి చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత మాత్రం ఉపాధ్యయులదేనని స్పష్టం చేశారు. పీఎంశ్రీ పాఠశాలల్లో పెండింగ్​లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Nizamabad Education Review | విద్యారంగంలో సంతృప్తికరమైన పనితీరు

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, విద్యా రంగంలో నిజామాబాద్ జిల్లా పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులు ప్రవేశాల విషయంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఐదవ స్థానంలో ఉందని, ఈ నెలాఖరు వరకు లక్ష్యానికి అనుగుణంగా ప్రవేశాలు పూర్తి చేసి జిల్లాను ముందంజలో నిలుపుతామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 21శాతం మేర ఎక్కువ ప్రవేశాలు జరిగాయని, నెలాఖరు నాటికి మరో 7శాతం ప్రవేశాలు పెంపొందించేలా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

Nizamabad Education Review | ఘన సన్మానం..

ఎస్సెస్సీలో టాపర్లుగా నిలిచిన లహరిక, సౌజన్య, సంజన, లాస్య, అభిజ్ఞ తదితరులకు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించగా, ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తన తరపున ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున నగదు పారితోషికం అందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులు ప్రవేశాలను పెంపొందించేందుకు కృషి చేసిన ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులను సైతం సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేష్, నుడా ఛైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం ఛైర్మన్ శేఖర్ గౌడ్, డీఈవో అశోక్, డీఆర్డీవో సాయాగౌడ్ పాల్గొన్నారు.

4233

ఇది కూడా చదవండి: ముద్రగడ పద్మనాభం భౌతిక ఖాయానికి నివాళులర్పించిన వైసీపీ అధినేత #ysjagancares

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *