అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 16 Market Analysis | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో వరుసగా నాలుగో సెషన్లోనూ ముడి చమురు (Crude oil) ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ద్రవ్యోల్బణం తగ్గుతుండటంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగియగా.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ఉన్నాయి.
ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
July 16 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
ద్రవ్యోల్బణం తగ్గుతున్న గణాంకాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచడంతో గత సెషన్లో యూఎస్ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. నాస్డాక్ (Nasdaq) 0.61 శాతం, ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరగ్గా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.09 శాతం నష్టంతో ఉంది.
July 16 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.19 శాతం పెరగ్గా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.59 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.13 శాతం నష్టపోయాయి.
July 16 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.50 శాతం లాభాలతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 6.98 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.22 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.88 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.61 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.47శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.15 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ ఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 753 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.02 నుంచి 0.95 కు తగ్గింది.
- విక్స్ 3.49 శాతం తగ్గి 13.49 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 85.40 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 57 పైసలు బలహీనపడి 96.26 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.54 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.56 వద్ద ఉన్నాయి.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.