అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Revanth Comments | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం ఇప్పటివరకు 76 సార్లు ఢిల్లీకి వెళ్లారని, కానీ తెలంగాణకు 76 పైసల ప్రయోజనమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.
KTR Revanth Comments | ఆ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
ముఖ్యమంత్రి CM స్థాయిలో ఉన్న వ్యక్తి “రక్తం చల్లాలి” వంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని కేటీఆర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం GOVT రాజకీయ విమర్శలకే పరిమితమవుతోందని ఆయన ఆరోపించారు.
KTR Delhi Visit | ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్
KTR Revanth Comments | మా ఓటమికి మేమే కారణం..
బీఆర్‌ఎస్ ఓటమికి బాహ్య కారణాలు కాదని, తమ పార్టీ చేసిన పొరపాట్లే కారణమని కేటీఆర్ అంగీకరించారు. ఆ తప్పులను విశ్లేషించి సరిదిద్దుకుంటున్నామని, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వచ్చే ఏడాది పాదయాత్ర..
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజా PUBLIC సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
వచ్చే ఏడాది YEAR రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని కేటీఆర్ ప్రకటించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.