అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fuel Export Tax | అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రిఫైనరీలు స్థానిక మార్కెట్‌ను పక్కనపెట్టి, విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలు గడించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
Fuel Export Tax | పన్ను పెంపు , తగ్గింపు వివరాలు..
ఈ చర్యలో భాగంగా కేంద్రం పన్నుల వ్యవస్థలో మార్పులు చేసింది. డీజిల్ , విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ఎగుమతులపై విధిస్తున్న అదనపు పన్నును లీటర్‌కు రూ. 7 మేర పెంచింది. దీనితో పన్ను రూ. 8.5 నుండి రూ. 15.5కి పెరిగింది. వినియోగదారులకు కొంత ఊరటనిచ్చేలా, పెట్రోల్ ఎగుమతులపై ఉన్న పన్నును లీటర్‌కు రూ. 4 నుండి రూ. 2.5కి తగ్గించింది.
Fuel Export Tax | సామాన్యులపై ప్రభావం..

ఈ కొత్త పన్ను నిబంధనలు నేటి నుంచే ( జులై 16 )అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశీయంగా ఇంధన కొరతను నివారించాలని భావిస్తోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉండటం వల్ల, భవిష్యత్తులో దేశీయ రిటైల్ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయేమోనని సామాన్య వినియోగదారులలో ఆందోళన నెలకొంది.
ఇది కూడా చదవండి..: Dr. Anil Menon | అంతరిక్షంలోకి మరో ఇండియన్.. ఎవరంటే..!