అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay Reaction | హైదరాబాద్ (Hyderabad) సైదాబాద్‌లోని ‘సక్సెస్’ ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. హిందూ సంస్కృతిపై జరుగుతున్న ఈ దాడిని ఆయన తప్పుబట్టారు.
Bandi Sanjay Reaction | దుర్మార్గమైన చర్య..
ఈ ఘటనపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసిన బండి సంజయ్, చిన్న పిల్లల మనసుల్లో మతపరమైన అంశాలను రుద్దడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను సమాజం ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ముఖ్యంగా, ‘సెక్యులర్’ వాదులు దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని, హిందూ సంస్కృతిని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Bandi Sanjay Reaction | రాష్ట్రమంతా విస్తరించే ప్రమాదం..

ఇటీవల ఆటో డ్రైవర్ భరత్‌కు ఎదురైన వేధింపుల అంశాన్ని కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రస్తావించారు. హిందువులను కించపరిచేలా ఆటోల మీద, గోడల మీద ఉర్దూలో రాతలు రాస్తున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన నిలదీశారు. ఒక వర్గానికి ఒక న్యాయం, భరత్ వంటి వారికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలను ప్రస్తుతమే అడ్డుకోకపోతే, భవిష్యత్తులో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Beekeeping Training | గోనెపల్లిలో తేనెటీగల పెంపకానికి మంత్రి సీతక్క శ్రీకారం