అక్షరటుడే, బోధన్: Bodhan Encroachment Removal | పట్టణంలో ఆక్రమణలపై ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు స్పందించారు. రోడ్లపై ఆక్రమణలను గురువారం తొలగించే కార్యక్రమం చేపట్టారు.
Bodhan Encroachment Removal | మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో..

మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు (Municipal Officers) పట్టణంలోని పాత బస్టాండ్, గోశాల రోడ్ ప్రాంతాల్లో గురువారం పరిశీలించారు. . రోడ్లను ఆక్రమిస్తూ నిర్వహిస్తున్న వ్యాపార దుకాణాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారస్తులతో మాట్లాడారు. రోడ్లపై వ్యాపారాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. భవిష్యత్తులోనూ తిరిగి తమ దుకాణాలను రోడ్లపైకి తీసుకొచ్చి వ్యాపారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్వో వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Youth Suicide Case | వేధింపులతో యువకుడి ఆత్మహత్య..