అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Venkatram Reddy | తన కుమారుడు డ్రగ్స్ తీసుకున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు. ‘‘మా అబ్బాయి భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టు.. మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు జరుగుతున్న ప్రచారం నిరాధారం” అని ఆయన స్పష్టంచేశారు.
మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మెరుపు దాడుల్లో ప్రముఖ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కాడని వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ కుమారుడు భరత్ కూడా డ్రగ్స్ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నాడని, స్వయంగా పాల్గొంటున్నాడని పోలీసులు గుర్తించారని ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి స్పందించారు.
MLC Venkatram Reddy | విచారణ కోసం వచ్చారు

మంగళ్‌హాట్ పోలీసులు (Mangalhat Police) తమ ఇంటికి వచ్చి గురువారం విచారణ జరిపారని ఎమ్మెల్సీ తెలిపారు. పోలీస్ విచారణలో తన కొడుకు డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు. కామన్ ఫ్రెండ్స్ ఫోన్ లిస్టులో ఉన్నవారి నంబర్లలో ఒకరి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా విచారణ జరిపారని పేర్కొన్నారు. భరత్ అరెస్ట్ కాలేదు. డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Golconda Bonalu 2026 | గోల్కొండలో బోనాల సందడి.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు