New Zealand Earthquake | న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక!

న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలో (South Island) గురువారం భారీ భూకంపం సంభవించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: New Zealand Earthquake | న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలో (South Island) గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైనట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ సంస్థ ‘జియోనెట్’ (GeoNet) వెల్లడించింది.

New Zealand Earthquake | ప్రకంపనల తీవ్రత..

స్థానిక కాలమానం ప్రకారం  9:14 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని కేంద్రం టె అనావ్ (Te Anau) పట్టణానికి ఉత్తరంగా 40 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 51 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో టె అనావ్‌తో పాటు క్వీన్స్‌టౌన్, డునెడిన్ వంటి ప్రధాన నగరాల్లో భారీగా ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

New Zealand Earthquake |సునామీ హెచ్చరికలు..

ఈ భూకంపం కారణంగా తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) హెచ్చరించింది. ముఖ్యంగా ‘మిల్‌ఫోర్డ్ సౌండ్’ నుంచి ‘పుయ్‌సెగర్ పాయింట్’ వరకు ఉన్న తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యల కోసం అధికారులు సిద్ధమవుతున్నారు.

 

ఇది కూడా చదవండి:  CCTNS 2.0 Training | సాంకేతికతతోనే సేవలు వేగం: ఎస్పీ రాజేష్ చంద్ర

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *