అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Statement | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో కేటీఆర్ గురువారం సమావేశం నిర్వహించారు. సగం పదవీకాలం పూర్తి కాకముందే కాంగ్రెస్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అవినీతి, స్కామ్‌లు, అక్రమాలు, అరాచకాలనే పాలనగా మార్చుకున్నారని ఆరోపించారు.
KTR Statement | 18న యువ సంగ్రామ సదస్సు
రైతులు సాగునీటి కోసం అడుగుతుంటే, వారికి భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి “రక్తం పారిస్తా” అన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. యువత, నిరుద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం “యూత్ డిక్లరేషన్” పేరిట భారీ మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లలోని హామీల అమలు వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ వరుసగా సభలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచనున్నట్లు పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Harish Rao Power Cuts | వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : హరీశ్‌రావు