Nacharam Lake | నాచారం చెరువు అభివృద్ధికి హైడ్రా శ్రీ‌కారం

ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాచారం పెద్ద చెరువు పున‌రుద్ధ‌ర‌ణ పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ గురువారం ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Nacharam Lake | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చెరువుల అభివృద్ధిపై హైడ్రా (Hydraa) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు చెరువులకు పూర్వ వైభవం తీసుకురాగా.. మరికొన్ని పనులు సాగుతున్నాయి. తాజాగా నాచారం చెరువు పునరుద్ధణకు శ్రీకారం చుట్టింది.

ఉప్ప‌ల్ (Uppal) నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాచారం పెద్ద చెరువు పున‌రుద్ధ‌ర‌ణ పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ గురువారం ప్రారంభించారు. 8.30 ఎక‌రాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేయనున్నారు. విశాల‌మైన క‌ట్ట నిర్మాణంతో పాటు.. పాత్ వేను నిర్మిస్తున్నారు. ప్రజలు సేద దీరే విధంగా చెరువు క‌ట్ట‌పై కూర్చునేందుకు వెసులుబాటు క‌ల్పిస్తున్నారు. చెరువు పక్కన ప్లే ఏరియాలు, పార్కులు అందుబాటులోకి రానున్నాయి. రూ. 28 కోట్ల‌తో ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నారు. చెరువులో 10 ఫీట్ల మేర పూడిక‌ను తొల‌గిస్తున్నామ‌ని హైడ్రా కమిషనర్​ తెలిపారు. 9 నెల‌ల్లో ఈ చెరువు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌స్తుంద‌ని వెల్లడించారు.

Nacharam Lake | నాగిరెడ్డికుంటను సైతం..

ranganant

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా యాప్రాల్‌లోని నాగిరెడ్డి కుంటను కూడా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్​ తెలిపారు. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని వెల్లడించారు. ప‌క్క‌నే ఉన్న ప్ర‌భుత్వ భూమిని కూడా కొంత‌మంది క‌బ్జా చేస్తున్నార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగనాథ్​ గురువారం చెరువును పరిశీలించారు. కాగా నగరంలో ఆక్రమణల తొలగింపుతో పాటు చెరువులకు పూర్వ వైభవం తీసుకు వస్తుండటంతో హైడ్రాకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చెరువులను పునరుద్ధరించి, ముంపు సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

 

దీనిని కూడా చదవండి : Adilabad ACB Trap | ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్​ ఈఈ, ఏఈ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *