అక్షరటుడే, వెబ్‌డెస్క్: Murshidabad Train Accident | పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా (Murshidabad District)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లెవల్ క్రాసింగ్ వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా.. స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు.
ముర్షిదాబాద్ జిల్లాలో కర్ణ సుబర్ణ స్టేషన్ సమీపంలో లెవల్-క్రాసింగ్ గేట్ తెరిచి ఉండటంతో పిల్లలతో వెళ్తున్న ఒక స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో వచ్చిన ఒక లోకల్ రైలు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో సహా ముగ్గురు మరణించారు. గోవిందాపూర్ రైల్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులతో పాటు సైకిల్‌పై వెళ్తున్న మరో వ్యక్తి కూడా ప్రమాదానికి గురయ్యారు.
Murshidabad Train Accident | పలువురికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో పలువురు పిల్లలు తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని బెర్హంపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను విచారించడానికి 10 మంది సభ్యుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో ఈస్టర్న్ రైల్వేలోని హౌరా డివిజన్ పరిధిలో ఉన్న అజిమ్‌గంజ్-కట్వా సెక్షన్‌లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి..: NEET Paper Leak | నీట్ యూజీ పేపర్ లీక్ కేసు : రూ.5 లక్షలకే ముందస్తు ప్రశ్నలు.. సీబీఐ వెల్లడి