Headmaster Suspended | ఉపాధ్యాయుల మధ్య గొడవ.. విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్ఎం

విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్​ఎంను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Headmaster Suspended | పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య గొడవలు ఉన్నాయి. కొన్ని రోజులగా టీచర్ల మధ్య వివాదాలు నెలకొన్నాయి. అయితే వారికి సర్దిచెప్పాల్సిన హెచ్​ఎం.. పాఠశాలలోని విద్యార్థులకు టీసీలు ఇచ్చారు. దీంతో అధికారులు సదరు హెచ్​ఎంను సస్పెండ్​ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District)లో చోటు చేసుకుంది.

తుంగతుర్తి మండలంలోని బండరామారం ఉన్నత పాఠశాలలో కొంతకాలంగా ఉపాధ్యాయుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పాఠాలు చెప్పి విద్యార్థుల భవిష్యత్​ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. వారిలో వారు గొడవలు పడుతున్నారు. అంతేగాకుండా విద్యార్థుల చదువు విషయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాల్సిన హెచ్​ఎం హకీమ్​.. వారిని ఏమి అనకుండా బడిలోని అందరు విద్యార్థులకు టీసీలు ఇవ్వడం గమనార్హం.

Headmaster Suspended | సస్పెండ్ చేసిన డీఈవో

హెచ్​ఎం నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్​ఎం హకీమ్​, ఉపాధ్యాయుల మధ్య గొడవలు ఉంటే.. తమ పిల్లలకు టీసీలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు విచారణ జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా హెచ్​ఎం నిర్ణయం తీసుకున్నారని, విద్యార్థుల భవిష్యత్​తో ఆటలు ఆడారని గుర్తించారు. ఈ మేరకు హెచ్​ఎం హకీమ్​ను సస్పెండ్ చేస్తూ డీఈవో అశోక్​ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో గొడవలకు కారణమైన నలుగురు ఉపాధ్యాయులకు సైతం మెమోలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి..: New Pensions | ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *