BRS Yuva Sangrama | బీఆర్‌ఎస్‌ ‘యువ సంగ్రామ సదస్సు’కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో జరగనున్న బీఆర్‌ఎస్‌ 'యువ సంగ్రామ సదస్సు'కు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: BRS Yuva Sangrama | హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో జరగనున్న బీఆర్‌ఎస్‌ ‘యువ సంగ్రామ సదస్సు’కు తెలంగాణ హైకోర్టు ( Telangana High Court )అనుమతి మంజూరు చేసింది. ఈ సదస్సును శాంతియుతంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేస్తూ, కొన్ని కీలక షరతులతో కూడిన అనుమతిని ఉన్నత న్యాయస్థానం జారీ చేసింది.

BRS Yuva Sangrama | కోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌..

సరూర్‌నగర్‌లో శనివారం (జులై 17)యువ సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే, దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆ పార్టీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వం , పోలీసుల వాదనలను విన్నది.

hycourt.1

BRS Yuva Sangrama | ప్రభుత్వ వాదనలు ..

సదస్సు జరిగే ప్రాంతంలో ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు ఉన్నాయని, అలాగే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు, 17 రోజుల క్రితమే అనుమతి కోరినప్పుడు, సమస్య ఉన్నట్లు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు సదస్సుకు అనుమతినిస్తూనే కొన్ని కఠినమైన షరతులను విధించింది. సదస్సును ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించాలి. రహదారులను దిగ్బంధించడం వంటి పనులకు పాల్పడకూడదు. ప్రజలను రెచ్చగొట్టేలా ఎటువంటి వ్యాఖ్యలు లేదా ప్రసంగాలు ఉండకూడదని బీఆర్‌ఎస్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

ఇది కూడా చదవండి:  Anganwadi Safety Issues | అధ్వానంగా అంగన్​వాడీల నిర్వహణ..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *