అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Johnny Master Show Cause | ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ (Telugu Film Dancers) అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాల్లో ఇటీవల జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ భార్య సుమలతపై డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది రాజీనామాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు శుక్రవారం సమావేశం అయ్యారు.
Johnny Master Show Cause | సహాయ నిరాకరణ
జానీ మాస్టర్ తీరుపై ఫెడరేషన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయనపై తక్షణమే సహాయ నిరాకరణ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 12న ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) ప్రతిష్ఠను దెబ్బతీసేలా జానీ మాస్టర్ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఫెడరేషన్ సీరియస్ అయింది. 14న విచారణకు పిలిచినా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వివరణ ఇచ్చే వరకు డ్యాన్సర్ అసోషియేషన్, జానీ మాస్టర్‌కు సహకరించకూడదంటూ అనుబంధ సంఘాలకు ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది.
దీనిని కూడా చదవండి : H Fast Inspection | ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్