Ande Sri | అందెశ్రీ నాకు ఆత్మబంధువు : సీఎం రేవంత్​

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024 జూన్ 2వ తేదీన జయ జయహే తెలంగాణ.. గీతాన్ని రాష్ట్ర గీతంగా జాతికి అంకితం చేసిన సందర్భంలో అందెశ్రీ భావోద్వేగానికి లోనైన సందర్భాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ande Sri | “అందెశ్రీ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కవిగా, గాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయం ఉండొచ్చు.. నాకు మాత్రం ఆత్మబంధువు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో ఆయన స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అందెశ్రీ కి పుష్పాంజలి ఘటించారు. భార్య మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ కుమారుడు దత్తుల సమక్షంలో స్మతివన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు.

FLO Headquarters | FLO ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం వెయ్యి గజాల స్థలం : సీఎం రేవంత్​

Ande Sri | నాకు పెద్దన్న అందెశ్రీ

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “కవి, గాయకుడు, ఉద్యమకారుడు.. నాకు ఆత్మబంధువుగా మారాడు. నా కుటుంబ సభ్యుడయ్యారు. మా కుటుంబంలో మేం ఏడుగురం అన్నదమ్ములం. నేను నాలుగో వాడిని. నాకు మా పెద్దన్ననే స్ఫూర్తి. తమ్ముడు ఒక స్థాయిలో ఉండాలని మా అన్న ఎన్నో కలలు గన్నడు. నేను ఎదుగుతున్న క్రమంలో నేను మా అన్నను కోల్పోయా. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందెశ్రీ” అని చెప్పారు.

ఈ సందర్భంగా అందెశ్రీ గారితో జరిగిన పరిచయ ప్రస్థానం, సాన్నిహిత్యాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. తెలంగాణ గడ్డపైన ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్నప్పుడు, ఈ తెలంగాణను ఆక్రమించుకుని దోచుకోవాలనుకుంటే ఏ తరమైనా అందెశ్రీ మళ్లీ పుడుతాడని హెచ్చరించారు.

“అందెశ్రీ స్ఫూర్తి మన గుండెల్లో నిత్యం కొలువై ఉంటుంది. ఒక స్ఫూర్తి ప్రదాతగా అందెశ్రీ అందరి గుండెల్లో ఉంటారు. అందెశ్రీ స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. అందెశ్రీ, గద్దర్ స్ఫూర్తితో ప్రభుత్వం ఉంటుంది” అని పేర్కొన్నారు.

akshara today .jpgande

Ande Sri | ప్రతి కుటుంబానికి రూ. కోటి

తెలంగాణ ఉద్యమంలో రెక్కలు ముక్కలు చేసుకొని.. గొంతుని, జీవితాలను ఉద్యమానికి అంకితం చేసిన 9 మందిని గుర్తించి .. పార్టీని, జెండాను చూడకుండా.. సత్కరించి ప్రతి కుటుంబానికి రూ. కోటి అందజేశాం. ఇది నా సొమ్ము కాదు. ప్రజల సొమ్ము అని చెప్పారు.

అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ.. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. వంటి ఎన్నో పాటలు.. అవి పాటలు కాదు. తూటాలై.. ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పకూల్చే మహా ఫిరంగులై పేలాయని ముఖ్యమంత్రి.. అందెశ్రీని స్మరిస్తూ పేర్కొన్నారు.

Ande Sri | రాష్ట్ర గీతంగా జాతికి అంకితం

పదాలపై పదాలు పేర్చి తెలంగాణ ప్రజల గుండెళ్ల్లో అందెశ్రీ రగిల్చిన ఉద్యమ స్ఫూర్తి, ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డను ఉద్యమం వైపు నడిపించిన ఉద్యమకారుడని స్మరించుకున్నారు.

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024 జూన్ 2వ తేదీన జయ జయహే తెలంగాణ.. గీతాన్ని రాష్ట్ర గీతంగా జాతికి అంకితం చేసిన సందర్భంలో అందెశ్రీ భావోద్వేగానికి లోనైన సందర్భాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *