Reservoir Dead Storage | రిజర్వాయర్లలో డెడ్​ స్టోరేజీ.. తాగునీటికి కష్టమే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటిమట్టం డెడ్​ స్టోరేజీకి చేరుకుందని మంత్రి తుమ్మల తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reservoir Dead Storage | వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్​ స్టోరేజీకి చేరుకున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటికి కూడా కష్టమేనని పేర్కొన్నారు.

ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముందస్తు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రులు తమ్ముల నాగేశ్వరరావు, శ్రీధర్​బాబు, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, తాగు నీరు, వైద్యం, విద్యుత్, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎల్-నినో ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక, ముందస్తు నివారణ చర్యలపై వివరించారు.

Reservoir Dead Storage | ఆరుతడి పంటలు వేయాలి

మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. దీంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని.. సాగునీటికే కాకుండా తాగునీటి అవసరాలు తీర్చడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. రైతులు పరిస్థితులను అర్థం చేసుకొని ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సైతం సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy Warning | కాంగ్రెస్​ నేతలకు సీఎం రేవంత్​ వార్నింగ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *