Harish Rao | రైతుల పట్ల రేవంత్ సర్కారు రాక్షస పాలన: హరీశ్ రావు

సిద్ధిపేటలో రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao | సిద్ధిపేటలో ( Siddipet ) రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

Harish Rao | నీటి ఎత్తిపోతలపై ఆరోపణ..

గోదావరిలో వరదలు వస్తున్నా, ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోయకపోవడం దారుణమని, ఇది రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు మండిపడ్డారు. భద్రాచలం మునిగిపోతుందనే ప్రభుత్వ వాదన కేవలం సాకు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. రైతుబంధు నిలిపివేత, సాగుకు విద్యుత్ కోతలు, యూరియా కొరతతో అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సాఫీగా జరిగిన వ్యవసాయ పనులను ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు.

Harish Rao |ఆదుకోవాలని డిమాండ్..

భవిష్యత్తులో కరువు వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అస్తవ్యస్తమైన ప్రాజెక్టుల నిర్వహణ వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:  Reservoir Dead Storage | రిజర్వాయర్లలో డెడ్​ స్టోరేజీ.. తాగునీటికి కష్టమే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *