Oora Panduga | ఆగస్టు 2న నగరంలో ఊర పండగ.. సర్వ సమాజ్​ కమిటీ నిర్ణయం

నగరంలో ఆగస్ట్​ 2న ఊర పండుగను నిర్వహించనున్నట్లు సర్వసమాజ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Oora Panduga | నగరంలో(Nizamabad City) ఆగస్ట్​ 2న ఊర పండుగను నిర్వహించనున్నట్లు సర్వసమాజ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ(Former MLA Yendala Lakshminarayana) పేర్కొన్నారు. నగరంలోని సిర్నపల్లి గడిలో ఆదివారం కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Oora Panduga | అంగరంగం వైభవంగా..

ఆయన మాట్లాడుతూ..ఊర పండుగలో భాగంగా జూలై 30న బండారు పోసే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏడాదిలాగే ఊర పండగను అన్ని కులాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఖిల్లా వద్ద అమ్మవార్ల గద్దెలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మున్సిపల్​, పోలీస్​శాఖ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. సర్వ సమాజ్​ కమిటీ కన్వీనర్​ రామర్తి గంగాధర్​ మాట్లాడుతూ.. కార్యక్రమం ఆసాంతం పక్కాగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్వ సమాజ కమిటీ కో కన్వీనర్​ ఆదె ప్రవీణ్​, కౌడపు శరత్, బంటు బలరాం, సత్యపాల్​ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *