అక్షరటుడే వెబ్‌డెస్క్: Parliament Winter Session | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభకు వెళ్లే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశాలు దేశాభివృద్ధికి ఎంతో కీలకమని అభివర్ణించారు. వర్షాకాలం , ఈ సమావేశాలు ఒకే సమయంలో రావడం శుభపరిణామమని, దీనివల్ల దేశానికి సత్ఫలితాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Parliament Winter Session | యువత సాధించిన అద్భుత ఘనత.
గత నెల రోజులుగా దేశంలో జరిగిన సానుకూల పరిణామాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా భారత అంతరిక్ష రంగంలో యువత సాధించిన విజయాలను ఆయన కొనియాడారు. ‘స్కై రూట్’ (Skyroot) సంస్థ ద్వారా 28 ఏళ్ల యువకులు అంతరిక్షంలోకి రాకెట్‌ను విజయవంతంగా పంపడాన్ని ప్రధాని ప్రశంసించారు. యువత ఇలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ, కొత్త విజయాలను అందుకోవడం దేశానికి గర్వకారణమని, ఇది భవిష్యత్ తరాలకు గొప్ప ప్రేరణనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Parliament Winter Session | దేశాభివృద్ధిలో కీలక ప్రాజెక్టులు..
రాజస్థాన్‌లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని జాతికి అంకితం చేయడం, సెమీ కండక్టర్ ప్లాంట్ , గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ వంటి అత్యాధునిక ప్రాజెక్టులను ప్రారంభించుకోవడం దేశ ప్రగతికి నిదర్శనమని ప్రధాని గుర్తుచేశారు. మధ్యప్రాచ్య దేశాల పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి, అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం 7.7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ ఆర్థికంగా బలంగా దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు.
Parliament Winter Session |సజావుగా సాగాల్సిన పార్లమెంట్..
దేశాభివృద్ధిలో అధికార, ప్రతిపక్షాల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. దేశాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సమావేశాలు సజావుగా, అర్థవంతంగా సాగాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ, చర్చల ద్వారా దేశానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు.#ParliamentMonsoonSession #PMModi #NarendraModi #Parliament #BreakingNews pic.twitter.com/XcZSlrmv3I
— Akshara Today | Telugu News (@aksharatoday) July 20, 2026
ఇది కూడా చదవండి: Rakesh Reddy | రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం.. పలువురు కాంగ్రెస్ నాయకుల అరెస్ట్