Vamsi Goud | బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా రత్నగారి వంశీ గౌడ్​

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా రత్నగారి వంశీగౌడ్​ ఎన్నికయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Vamsi Goud | తెలంగాణ భారత జనతా యువ మోర్చా (బీజీవైఎం) జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్​. రామచందర్​రావు ఆదేశాల మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్​ కుండే జిల్లా అధ్యక్షుల వివరాలను వెల్లడించారు.

Vamsi Goud | పార్టీ బలోపేతానికి..

నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) అధ్యక్షుడిగా రత్నగారి వంశీ గౌడ్​ ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జిల్లా అధ్యక్షుడిగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్‌పాల్​కు, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డికి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణతో, అంకితభావంతో పని చేస్తానని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తానని రత్నగారి వంశీగౌడ్​ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Dhanpal Suryanarayana | అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హౌస్ అరెస్ట్..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *