TSRTC Welfare | త్వరలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టడమే కాకుండా, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: TSRTC Welfare | టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టడమే కాకుండా, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar )స్పష్టం చేశారు. ఆర్టీసీ కళాభవన్‍లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇటీవల మరణించిన నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్ కుటుంబ సభ్యులకు రూ. 90.85 లక్షల చెక్కును అందజేశారు.

TSRTC Welfare | కార్మికులకు ప్రభుత్వ భరోసా..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీని సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌలభ్యం, కార్మికుల సంక్షేమం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. మరణించిన డ్రైవర్ శంకర్ కుమారుడు హేమంత్‌కు ఉద్యోగంతో పాటు, వారి కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రిటైర్డ్ కార్మికుల సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

TSRTC Welfare | ఆర్టీసీలో కీలక మార్పులు..

గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మిక సంఘాలను అణచివేశారని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల కోసం ‘మహాలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా సంస్థకు నెలకు రూ. 300 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసే క్రమంలో భాగంగా, మెట్రో , ఎంఎంటీఎస్ (MMTS) సేవలతో ఆర్టీసీ బస్సులను అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. గ్రామాల నుంచి రాజధాని వరకు కొత్త మార్గాల్లో బస్సులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

TSRTC Welfare |మౌలిక సదుపాయాలు..

క్యూర్ ఏరియా పరిధిలో కొత్త బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ అనేది సామాన్యుడి రవాణా సాధనమని, పేదలకు మెరుగైన సేవలందించే దిశగా యాజమాన్యం, కార్మికులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. త్వరలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

 

ఇది కూడా చదవండి:  Kamareddy Police | వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీసులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *