Telangana Police Welfare | పోలీసులకు గుడ్​న్యూస్​.. తక్కువ వడ్డీకే రుణాలు

పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Police Welfare | పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)​ అన్నారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత విభాగాలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పోలీస్​ సిబ్బందికి తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని ఆదేశించారు.

డీజీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఆర్థిక రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.

Telangana Police Welfare | దుర్వినియోగం చేస్తే చర్యలు

సంక్షేమ పథకాలను వ్యాపార దందాగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ హెచ్చరించారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే వేలాది మంది పోలీసు కుటుంబాలు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ, ఆరోగ్య భద్రత విభాగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచాలని డీజీపీ సూచించారు. వెల్ఫేర్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలన్నారు. అర్హులైన పోలీసులకు ఓపెన్ ప్లాట్ రుణాలు 9 శాతం వడ్డీతో, గృహ రుణాలు (Home Loans) 6.75 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాలు రూ.5 లక్షల వరకు 11 శాతం వడ్డీతో, కుమార్తె వివాహానికి రూ.6 లక్షల వరకు, దేశీయ, విదేశీ ఉన్నత విద్య కోసం రూ.30 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : TSRTC Welfare | త్వరలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *