Uday Krishna Reddy | మేము రిలేషన్​లో ఉన్నాం.. సూసైడ్​ నోట్​లో ట్రైనీ ఐపీఎస్​

తనపై ఫిర్యాదు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్​తో ఏడాదిగా రిలేషన్​షిప్​లో ఉన్నట్లు ఉదయ్​ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సూసైడ్​ నోట్​ రాసి, ఆత్మహత్యకు యత్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS)​ ఉదయ్​ కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాసిన సూసైడ్​ నోట్​లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జాతీయ పోలీస్​ అకాడమీలో ఉదయ్​ కృష్ణారెడ్డి ట్రైనింగ్​ తీసుకుంటున్నారు. శిక్షణలో ఉన్న ట్రైనీ మహిళా ఐపీఎస్​ తనను ఉదయ్​ కృష్ణారెడ్డి వేధించాడని అత్తాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఉదయ్​ కృష్ణారెడ్డి సూసైడ్​ నోట్​ రాసి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

Uday Krishna Reddy | ఏడాదిగా సంబంధం ఉంది

తనపై ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్​తో తనకు ఏడాదిగా సంబంధం ఉందని ఉదయ్​ కృష్ణారెడ్డి సూసైడ్​ నోట్​లో రాశారు. తాము రిలేషన్​లో ఉన్నామని పేర్కొన్నారు. ఆమెకు వివాహం జరిగిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగిందని తెలిపారు. ఆమె తన గదికి వచ్చి, తలుపు తీయమని అడిగిందని ఆరోపించారు. ఇందుకు ఆధారంగా తన వాట్సాప్​ చాట్ ఉందని చెప్పారు. అయితే తన రూమ్​కు రావొద్దని ఆమెకు గతంలో చెప్పానని పేర్కొన్నారు. అయినా వినకపోవడంతో రూమ్​కు వచ్చిన సమయంలో వీడియో తీసి భర్తకు పంపానని చెప్పారు.

Uday Krishna Reddy | తప్పుడు కేసు పెట్టి..

సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్​ తనపై తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. ఆమె తన రూమ్​కు వచ్చిందని, ఆ విషయాన్ని భర్తకు చెప్పడంతో తనపై కక్ష పెంచుకుందన్నారు. అంతా మనిపులేట్ చేసి తానే వేధించినట్లు కేసు పెట్టినట్లు ఆరోపించారు. ఈ విషయంలో ఆమెకు మరో ముగ్గురు సహకరించారని, తాను ఏ తప్పు చేయలేదన్నారు. తన చావుకు ఆ నలుగురు కారణం అని సూసైడ్​ నోట్​లో రాశారు. ఆధారాల కోసం తన ఫోన్​లో డేటాను పరిశీలించాలని సూచించాడు. అయితే ఈ విషయంలో ఏవరిది నిజమని పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

దీనిని కూడా చదవండి : Jammu Kashmir Landslide | విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *