Balakrishna Injury | షూటింగ్‌లో బాలకృష్ణకు గాయాలు

సినీ నటుడు బాలకృష్ణ షూటింగ్​లో గాయపడ్డారు. కాకినాడలో ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన మోకాలికి స్వల్ప గాయం అయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Balakrishna Injury | సినీ నటుడు బాలకృష్ణ షూటింగ్​లో గాయపడ్డారు. కాకినాడలో ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన మోకాలికి స్వల్ప గాయం అయింది.

బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. మాస్​ ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ యాక్షన్​తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్​ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఫైట్ షూట్ చేస్తుండగా.. మంగళవారం బాలకృష్ణ ప్రమాదవశాత్తు కింద జారి పడిపోయారు. దీంతో ఆయన మోకాలికి స్వల్ప గాయం అయింది.

Balakrishna Injury | ఆస్పత్రికి తరలింపు

బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్​ ఆపేశారు. అనంతరం ఆయనను చిత్ర యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పలు పరీక్షులు నిర్వహించారు. స్వల్పం గాయం కావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొన్ని రోజులు రెస్ట్​ తీసుకొమ్మని చెప్పినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: National Film Awards | జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *