Vivo T5 Lite | అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన వివో భారత మార్కెట్‌లో టీ 5 లైట్ పేరుతో మరో మోడల్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈనెల 22 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vivo T5 Lite | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన వివో భారత మార్కెట్‌లో మరో మోడల్ ఫోన్‌ను విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో టీ 5 లైట్ పేరుతో దీనిని తీసుకువచ్చింది.

ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 44 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 6500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. పలు ఏఐ ఫీచర్లున్నాయి. జూలై 22న ఫ్లిప్‌కార్ట్ (Flipkart), వీవో రిటైల్ స్టోర్‌లలో విక్రయానికి అందుబాటులో ఉండనుంది. ప్రారంభ ఆఫర్లతో రూ. 18,499 కే అందుబాటులో ఉండే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.74 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అమర్చారు. 1600 900 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్.. మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.
కలిగి ఉంటుంది. ఐపీ65 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస6తో పనిచేస్తుంది.

Vivo T5 Lite | కెమెరా, ఏఐ ఫీచర్లు..

వెనక భాగంలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 0.8 ఎంపీ సెకండరీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
ఫోన్ సెఫ్టీ, ప్రైవసీ కోసం ఏఐ క్రియేషన్, ఏఐ క్యాప్షన్, ప్రైవేట్ స్పేస్ వంటి స్మార్ట్ ఏఐ టూల్స్‌ను కూడా అందించింది.

బ్యాటరీ : 6500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు. ఇది 44 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఫుల్ చార్జి చేస్తే 54 గంటల పాటు వాయిస్ కాల్స్, 80 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 48 గంటల వీడియో ప్లేబ్యాక్ పొందవచ్చని కంపెనీ చెబుతోంది.

Vivo T5 Lite | వేరియంట్లు..

ఈ ఫోన్ వేవ్ బ్లూ, ట్విలైట్ షాడో రంగుల్లో మూడు వేరియంట్లలో లభిస్తుంది.
4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ. 19,999.
6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ. 21,999.
6జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ. 24,999.

కార్డ్ ఆఫర్లు : ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ. 1,500 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *