అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 22 Market Analysis | ఓవైపు పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్(Geo political tensions) కొనసాగుతుండగా మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 2028 నుంచి దిగుమతి చేసుకునే జెనరిక్ ఔషధాలపై 100 శాతం ఆ తర్వాత సంవత్సరం నుంచి 200 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు.
ఇది మన ఔషధ కంపెనీలకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty)నెగెటివ్‌గా ట్రేడ్ అవుతోంది. ఇది మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమవుతాయన్న సంకేతాన్ని ఇస్తోంది.
July 22 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
సెమీకండక్టర్ షేర్లలో ర్యాలీతో వాల్‌స్ట్రీట్ కోలుకుంది. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.29 శాతం, ఎస్ అండ్ పీ 0.89 శాతం నష్టపోగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.08 శాతం నష్టంతో ఉంది.
July 22 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.66 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.28 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.58 శాతం లాభపడ్డాయి.
July 22 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 5.31 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.51 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.84 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.41 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.59 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.50 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.21 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,650 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 656 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.28 నుంచి 1.01 కు పడిపోయింది.
- విక్స్ 2.93 శాతం తగ్గి 12.6 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.13 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 96.24 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.13 కు, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.63 కు పెరిగాయి.