అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahesh Goud Arrest | పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్‌లోని లోక్ భవన్ వద్ద ఆందోళన చేపట్టిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
Mahesh Goud Arrest | ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలి
మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. నెక్లెస్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ ‘చలో లోక్ భవన్’ ప్రదర్శన లోక్ భవన్‌కు చేరుకుంది. ఏఐసీసీ అగ్రనేతలపై పోలీసుల చర్యను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Comments | డ్రామాలు కట్టిపెట్టి చర్చకు రండి.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్